వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఈరోజే రాజీనామా: దీక్షస్థలి వద్ద నాగం ప్రకటన

By Srinivas
|
Google Oneindia TeluguNews

Nagam Janardhan Reddy
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు రెండు కళ్ల సిద్దాంతం ఏమాత్రం పని చేయదని టిడిపి నుండి బహిష్కరింపబడిన శాసనసభ్యుడు నాగం జనార్దన్ రెడ్డి ఆదివారం ఇందిరాపార్కు ఏక్తాదీక్ష ప్రారంభం సందర్భంగా విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రకటించిన తర్వాత తెలుగుదేశం పార్టీ యు టర్న్ తీసుకుందని ఆరోపించారు. అంతకుముందు తెలంగాణకు తీర్మానం చేసిన టిడిపి తర్వాత యు టర్న్ తీసుకొని వచ్చిన తెలంగాణను వెనక్కి పంపించిందని ఆరోపించారు.

సోమవారం తెలంగాణ కాంగ్రెసు పార్టీ ప్రజాప్రతినిధులు రాజీనామా చేసి చరిత్ర సృష్టించనున్నారని అన్నారు. వచ్చిన తెలంగాణను సీమాంధ్రనేతలు ఐక్యంగా అడ్డుకున్నారని, ఇప్పుడు తెలంగాణ నేతలు కూడా ఐక్యంగా తెలంగాణ సాధించాలని అన్నారు. దోచుకోవడానికే సీమాంధ్ర నేతలు సమైక్య నినాదం వినిపిస్తున్నారని అన్నారు. ముల్కీ రుల్సు, 610 జివో తదితర ఒప్పందాలను తుంగలో తొక్కిన సీమాంధ్ర నేతలు ఇప్పుడు సమైక్య నినాదం వినిపించి తెలంగాణను అభివృద్ధి చేస్తాననడంలో స్వార్థం తప్ప ఏదీ లేదన్నారు.

కాగా కాంగ్రెసు పార్టీ రాజీనామాకు సిద్ధమైన సందర్భంలో తాము కూడా రాజీనామాకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. తాము అందరికంటే ముందే రాజీనామాలు చేస్తున్నట్లు నాగం చెప్పారు. దీక్షాస్థలి నుండి ఇప్పుడే తాము రాజీనామాలు పంపుతామని నాగం చెప్పారు. నాగంతో పాటు హరీశ్వర్ రెడ్డి, వేణుగోపాలరావు, జోగు రామన్న రాజీనామాకు సిద్ధపడినట్లు తెలుస్తోంది.

English summary
TDP suspended MLA Nagam Janardhan Reddy blamed today TDP president Nara Chandrababu Naidu for Telangana issue from his ekta deesha.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X