వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సిఎం సూచనతో వెనక్కి తగ్గిన సీమాంధ్ర నేతలు

By Srinivas
|
Google Oneindia TeluguNews

TG Venkatesh
హైదరాబాద్: సమైక్యాంధ్ర కోసం అధిష్టానం వద్దకు జూలై 5న వెళదామని నిర్ణయించుకున్న సీమాంధ్ర కాంగ్రెసు ప్రజాప్రతినిధులు వెనక్కి తగ్గారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం అనుకూలంగా ప్రకటన చేయకుంటే సోమవారం ఉదయం నేరుగా సభాపతికే రాజీనామాలు సమర్పిస్తామని తెలంగాణ ప్రాంత కాంగ్రెసు ప్రజాప్రతినిధులు హెచ్చరించిన నేపథ్యంలో సీమాంధ్ర కాంగ్రెసు కూడా సమైక్యాంధ్ర కోసం ఈ నెల 5న ఢిల్లీ బాట పట్టాలని నిర్ణయించుకుంది. తెలంగాణ సెంటిమెంట్ బలంగా ఉన్న నేపథ్యంలో టి-కాంగ్రెసు రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్న ఇలాంటి క్లిష్ట పరిస్థితిలో అధిష్టానాన్ని ఇరుకున పెట్టే విధంగా చేయకూడదని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సీమాంధ్ర నేతలకు సూచించిన కారణంగానే వారు వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది.

ఈ సందర్భంగా మంత్రి టిజి వెంకటేష్ మాట్లాడూతూ సమైక్యాంధ్ర కోసం ఈ నెల 5న ఢిల్లీ వెళ్లాలని నిర్ణయించుకున్నామని అయితే అధిష్టానం తమను ఇప్పుడు రావద్దని చెప్పిందని అందుకే వాయిదా వేసుకున్నట్టు చెప్పారు. అన్ని ప్రాంతాల నేతలను ఓసారి పిలిచి మాట్లాడతామని అధిష్టానం చెప్పిందని టిజి చెప్పారు. సీమాంధ్ర నేతలంతా సమైక్యాంధ్రకు కట్టుబడి ఉన్నారని ఆయన అన్నారు.

English summary
Seemandhra congress leaders took back step on New Delhi tour today by CM Kiran Kumar Reddy suggation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X