వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎపి రాజకీయాలపై సోనియా అత్యవసర భేటీ

By Srinivas
|
Google Oneindia TeluguNews

Sonia gandhi
హైదరాబాద్: తెలంగాణ ప్రాంత కాంగ్రెసు ప్రజాప్రతినిధుల రాజీనామాల హెచ్చరికలు ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీని సైతం తగిలాయి. టి-కాంగ్రెసు రాజీనామాలతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో తీవ్ర సంక్షోభం ఎదురవనున్న నేపథ్యంలో ఆమె ట్రబుల్ షూటర్ ప్రణబ్ ముఖర్జీ, అహ్మద్ పటేల్ తదితరులతో ఆదివారం మధ్యాహ్నం మూడు గంటలకు భేటీ కానున్నట్లుగా తెలుస్తోంది. ఆదివారం సోనియా లోక్ పాల్ బిల్లు విషయంపై చర్చించేందుకు పార్టీ నేతలతో సమావేశం కానున్నారు. అయితే తెలంగాణ విషయం ముదిరి పాకాన పడటంతో ఆమె లోక్ పాల్ విషయంతో పాటు తెలంగాణపై ప్రత్యేకంగా ఈ సమావేశంలో దృష్టి సారించే పరిస్థితి కనిపిస్తోంది.

ఇప్పటికే టి-కాంగ్రెసు నేతలను బుజ్జగించే ప్రయత్నాలు అధిష్టానం చేసింది. కేంద్రమంత్రులు, రాష్ట్ర పిసిసి చీఫ్, ముఖ్యమంత్రి తదితరులు తమ తమ ప్రయత్నాలు చేసినప్పటికీ టి-కాంగ్రెసు వెనక్కి తగ్గలేదు. రాత్రంతా ఫోన్లో రాయబారాలు నెరిపింది. తెలంగాణకు చెందిన కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డినీ రంగంలోకి దింపారు. దీంతో సోనియా గాంధీ ఈ భేటీలో తెలంగాణ అంశంపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. రాజీనామా చేయకుండా ఉండటానికి ఇంకా ఏం చేయాలి. ఒకవేళ వారు రాజీనామా చేసినా తర్వాత అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నట్లుగా తెలుస్తోంది. రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ గులాం నబీ ఆజాద్ చేసిన వ్యాఖ్యలపై టి-నేతలు గుర్రుగా ఉన్న విషయంపై చర్చించే అవకాశం ఉంది.

English summary
AICC president Sonia Gandhi will be conducting emergency meeting on AP politics.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X