వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కిరణ్ కుమార్ రెడ్డి అప్రమత్తం, స్థితిపై సమీక్ష

By Pratap
|
Google Oneindia TeluguNews

Kirankumar Reddy
హైదరాబాద్: తెలంగాణ ప్రజాప్రతినిధుల రాజీనామాలు, తెలంగాణ జెఎసి బంద్ పిలుపు నేపథ్యంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అప్రమత్తమయ్యారు. ఆయన సోమవారం సాయంత్రం ఉన్నత స్థాయి సమావేశంలో పరిస్థితిని సమీక్షించి, తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులను ఆదేశించారు. రాజీనామా చేసిన హోం మంత్రి సబితా ఇంద్రా రెడ్డి కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, మంత్రులు ధర్మాన ప్రసాద రావు, మోపిదేవి వెంకటరమణ, మాణిక్యవరప్రసాద్, రఘువీరా రెడ్డి తదితరులు పాల్గొన్నారు. శాంతి భద్రతల ఐజి, ఇంటలిజెన్స్ చీఫ్, హైదరాబాదు పోలీసు కమిషనర్, హోం శాఖ కార్యదర్శి తదితర ఉన్నతాధికారులు కూడా సమావేశంలో పాల్గొన్నారు.

హైదరాబాద్ పోలీసు కమిషనర్ ఎకె ఖాన్ హైదరాబాదులో నిషేదాజ్ఞలు విధించారు. ఈ నెల 11వ తేదీ వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని ఆయన చెప్పారు. అనుమతి లేకుండా సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించకూడదని ఆయన ఆదేశించారు. వాటికి ముందస్తు అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని ఆయన చెప్పారు. బంద్ నేపథ్యంలో హైదరాబాదులోని పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు పెద్ద యెత్తున క్యూ కట్టారు. దీంతో పెట్రోల్ బంకుల వద్ద ట్రాఫిక్ జామ్ అయింది. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆందోళనకారులను రెచ్చగొట్టే చర్యలకు దిగవద్దని ఢిల్లీలో ఉన్న డిజిపి దినేష్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

English summary
CM Kirankuamar Reddy reviewed the situation in waje of 48 hours bandh and Telangana leaders resignations.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X