వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
జగన్ పార్టీలోకి సూపర్ స్టార్ కృష్ణ దంపతులు

కొత్త రక్తాన్ని, యువతను ప్రోత్సహించడానికే తాము వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరుతున్నట్లు ఆమె తెలిపారు. యువతను ప్రోత్సహించాలనేది పెద్దలుగా తమ బాధ్యత అని ఆమె అన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీని గెలిపించడానికి తమ కుటుంబ సభ్యులమంతా కృషి చేస్తామని ఆమె చెప్పారు. మానసికంగా తాము వైయస్ జగన్మోహన్ రెడ్డితో ఉన్నామని ఆమె అన్నారు. తాను, కృష్ణ క్రియాశీలకంగా ఉండబోమని, నరేష్ మాత్రం క్రియాశీలకంగా రాజకీయాల్లో వ్యవహరిస్తారని ఆమె అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి మరణించిన తర్వాత కాంగ్రెసు పార్టీ పరిస్థితి ఏమిటో తేలిపోయిందని నరేష్ అన్నారు. గతంలో కృష్ణ పార్లమెంటు సభ్యుడిగా కూడా ఎన్నికయ్యారు. నరేష్ బిజెపిలో కొంత కాలం పనిచేశారు.