ప్రణబ్ ముఖర్జీతో భేటీ, తెలంగాణ నేతలకు నిరాశే

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర అవసరం గురించి తాము ప్రణభ్‌కు చెప్పామని, పరిస్థితిని వివరించామని, తాను ఇతర అధిష్టానం పెద్దలతో పరిస్థితిని వివరిస్తామని ప్రణభ్ అన్నారని సమావేశానంతరం మంత్రి కె. జానా రెడ్డి మీడియా ప్రతినిధులతో చెప్పారు. ప్రణబ్ నుంచి వారికి ఆశాజనకమైన సమాచారం అందలేదని అర్థమవుతోంది. జానా రెడ్డి మాత్రమే రెండు మూడు మాటలు చెప్పేసి మీడియా ప్రతినిధులు వేసిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా వెళ్లిపోయారు. మిగతా నాయకులు కూడా మీడియాతో మాట్లాడకుండా వెళ్లిపోయారు. ఎప్పుడు సంప్రదింపులు ప్రారంభిస్తారు, ఎప్పుడు పూర్తి చేస్తారని తెలంగాణ నేతలు అధిష్టానం పెద్దలను అడుగుతున్నారు. దానికి వారికి అధిష్టానం పెద్దల నుంచి సరైన సమాధానం రావడం లేదు.
తెలంగాణ విషయంపై కాంగ్రెసు అధిష్టానం పక్కాగా యు- టర్న్ తీసుకున్నట్లే కనిపిస్తోంది. గులాం నబీ ఆజాద్ వంటి నేతలు చెబుతున్న విషయాలు ఆ విషయాన్నే తెలియజేస్తున్నాయి. సంప్రదింపులు జరపాల్సిన అవసరం ఉంది, ఏకాభిప్రాయ సాధన వంటి మాటల ద్వారా వ్యవహారాన్ని కాంగ్రెసు అధిష్టానం మళ్లీ మొదటికి తెచ్చింది.












Click it and Unblock the Notifications