ఫిక్స్‌లో కాంగ్రెసు: వెనక నుయ్యి ముందు గొయ్యి

సీమాంధ్ర నుంచి ఎక్కువ మంది పార్లమెంటు సభ్యులు ఉండడం, వారికి లాబీయింగ్ శక్తి ఎక్కువగా ఉండడం వల్ల కాంగ్రెసు అధిష్టానం వారి నుంచి వ్యతిరేకతను ఎదుర్కోవడానికి సిద్ధంగా లేనట్లు చెబుతున్నారు. ఈ స్థితిలో కాంగ్రెసు ప్రజాప్రతినిధులకు మాత్రమే నచ్చజెప్పేందుకు ప్రయత్నిస్తోంది. ఎఐసిసి అధికార ప్రతినిధి మనీష్ తివారీ మాటల్లో ఇదే కనిపిస్తోంది. తెలంగాణ ప్రజాప్రతినిధులు ఓపిక పట్టాలని, ఓపిక పడితేనే తెలంగాణకు నిర్మాణాత్మక పరిష్కారం లభిస్తుందని ఆయన బుధవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. తెలంగాణ సమస్య పరిష్కారానికి చర్చలకు సహకరించాలని ఆయన సూచించారు.
చర్చలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసమే జరగాలని, అందుకు నిర్దిష్ట కాలపరిమితి పెట్టాలని తెలంగాణ పార్లమెంటు సభ్యులు కాంగ్రెసు అధిష్టానాన్ని కోరారు. అయితే, అందుకు కాంగ్రెసు అధిష్టానం సిద్ధంగా లేదు. తెలంగాణ ప్రజాప్రతినిధులను బుజ్జగించే ప్రయత్నాలు మరింత కాలం కొనసాగించాలని, తద్వారా కొంత మంది వెనక్కి తగ్గవచ్చునని కూడా కాంగ్రెసు అధిష్టానం యోచిస్తోంది.