అసంతృప్తి, ఆజాద్‌తో భేటీకి తెలంగాణ ఎంపీలు నో

తెలంగాణ అంశాన్ని మళ్లీ మొదటికి తెస్తూ గులాం నబీ ఆజాద్ మాట్లాడుతుండడంతో కాంగ్రెసు తెలంగాణ నేతలు గుర్రుగా ఉన్నారు. మంగళవారం అర్ధరాత్రి సమయంలో తెలంగాణ నేతలు కేంద్ర మంత్రి ప్రణబ్ ముఖర్జీతో చర్చలు జరిపారు. ఆ చర్చల్లో కూడా ఏ విధమైన పురోగతి లేదు. దీంతో తెలంగాణ నేతలు తీవ్ర నిరాశతో కనిపించారు. ఆజాద్‌తో భేటీ కాకూడదని పార్లమెంటు సభ్యులు నిర్ణయించుకోవడంతో మంత్రులు జానా రెడ్డి, సారయ్య, పొన్నాల లక్ష్మయ్య, శాసనసభ్యుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి ఆయనతో బుధవారం ఉదయం సమావేశమయ్యారు.












Click it and Unblock the Notifications