హైదరాబాద్: సీమాంధ్ర ప్రజాప్రతినిధులను ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ మెప్పించి ఒప్పించి ప్రత్యేక తెలంగాణకు అనుకూలతను ఏర్పరచాలని కాంగ్రెసు పార్టీ సీనియర్ శాసనసభ్యుడు దామోదర రెడ్డి బుధవారం అసెంబ్లీ పాయింటులోని మీడియా పాయింటు వద్ద మాట్లాడుతూ అన్నారు. హైదరాబాదులో ఉన్న సీమాంధ్రులకు తెలంగాణ నుండి హామీ ఉంటుందని చెప్పారు. వారి అస్తులకు, వారికి పూర్తి భద్రత ఉంటుందన్నారు. తెలంగాణపై కేంద్రం వెంటనే నిర్ణయం తీసుకోవాలన్నారు. తెలంగాణకు అనుకూలంగా కేంద్రం నిర్ణయం ఉంటే రాజీనామాలు వెనక్కి తీసుకునే ప్రసక్తి లేదన్నారు.
అధిష్టానానికి సమయం ఇస్తామని కానీ ఓ నిర్ధిష్ట సమయంలోగా చర్చలు పూర్తి చేయాలని అన్నారు. ప్రభుత్వం రద్దైనా రాష్ట్రపతి పాలన వచ్చినా రాజీనామాలపై వెనక్కి తగ్గేది లేదన్నారు. వైయస్సాఆర్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి తెలంగాణపై తన నిర్ణయం ప్లీనరీలో ప్రకటించాలని అన్నారు. తాము తెలంగాణ మినహా మరే ప్రత్యామ్నాయానికి ఆమోదించమని చెప్పారు. కేంద్రం ప్రకటించిన తెలంగాణ రాష్ట్రాన్ని సీమాంధ్ర నేతలు రాజీనామాలతో అడ్డుకున్నారని ఎమ్మెల్సీ కెఆర్ ఆమోస్ విమర్శఇంచారు. తెలంగాణ కోసం మరోసారి చర్చలు అవసరం లేదని ఆయన అభిప్రాయపడ్డారు.