కాంగ్రెసు రాజీనామాలు నమ్మొద్దు: ఓయు విద్యార్థులు

ఓయు ఆర్ట్స్ కళాశాల నుండి విద్యార్థులు ర్యాలీ ప్రారంభించారు. ప్రభుత్వం 14ఎఫ్ వెంటనే రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంపై వెంటనే నిర్ణయం తీసుకోవాలన్నారు. ఉస్మానియా క్యాంపస్‌లో ఉన్న పోలీసు బలగాలను వెనక్కి పిలవాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. తాము శాంతియుతంగానే ఆందోళన, ర్యాలీలు చేపట్టినప్పటికీ పోలీసులు మొదట రెచ్చగొట్టే పనులు చేస్తారని అలాంటివి చేయడం మానుకోవాలని కోరారు. కాగా విద్యార్థుల ర్యాలీ కారణంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రభుత్వం భారీగా పోలీసు బలగాలను మోహరించింది.












Click it and Unblock the Notifications