లగడపాటి, కావూరిలపై దుమ్మెత్తిపోసిన కెటిఆర్

KT Rama Rao
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకిస్తున్న కాంగ్రెసు సీమాంధ్ర పార్లమెంటు సభ్యులు లగడపాటి రాజగోపాల్, కావూరి సాంబశివరావులపై తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభ్యుడు కెటి రామారావు దుమ్మెత్తిపోశారు. మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన 1953 నుంచి ఇప్పటి వరకు సీమాంధ్ర నేతలు మద్రాసు వంటి నగరాన్ని తమ ప్రాంతాల్లో నిర్మించలేకపోయారని, దీంతో పొట్టి శ్రీరాములు ఆత్మ క్షోభిస్తోందని, మద్రాసు రాష్ట్రం నుంచి ఆంధ్ర ప్రాంతం విడిపోవాలని దీక్ష చేసి ఆత్మత్యాగం చేసిన పొట్టి శ్రీరాములు తమకు ఆదర్శమని ఆయన గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. కావూరి సాంబశివ రావు వలసవాది అని, సమైక్యవాది కూడా కాదని ఆయన అన్నారు. కావూరికి చరిత్ర తెలియదని, దేశ సమగ్రత గురించి మాట్లాడే నైతిక హక్కు కావూరికి లేదని ఆయన అన్నారు. కావూరి వ్యాఖ్యలు దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉన్నాయని ఆయన వ్యాఖ్యానించారు.

రాజీనామాలతో కేంద్రంలో కదలిక వచ్చిందని ఆయన చెప్పారు. సీమాంధ్ర ప్రజలు సమైక్యవాదానికి మద్దతు పలకడ లేదని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అడ్డుపడుతున్నది సీమాంధ్ర పెట్టుబడిదారులేనని ఆయన విమర్శించారు. కావూరి వ్యాఖ్యలు తెలంగాణ ప్రజలను అవమానించే విధంగా ఉన్నాయని ఆయన అన్నారు. తమ స్వార్థం కోసం సీమాంధ్ర నాయకులు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన అన్నారు. సీమాంధ్ర నాయకులది ఆర్థికవాదం, అవకాశవాదమని ఆయన అన్నారు. ఢిల్లీలో జరిగిన విశాలాంధ్ర మహాసభ సదస్సులో తెలంగాణ ప్రజలను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసిన వక్తలు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. విశాలాంధ్ర మహాసభను ఉనికి లేని సంస్థగా ఆయన అభివర్ణించారు. అందులో ప్రసంగించి తెలంగాణను వ్యతిరేకించిన వక్తలను ఆయన కుహనా మేధావులుగా అభివర్ణించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+