మొదట హైదరాబాదులో దోచిందెంతో తేల్చండి: నాగం

నాగం టిడిపిపైనా విమర్శలు గుప్పించారు. తెలుగుదేశం పార్టీ తెలంగాణ నేతలు ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుతో తెలంగాణపై స్పష్టమైన ప్రకటన చేయిస్తే తెలంగాణలో తెలుగుదేశం పార్టీని నమ్ముతారని చెప్పారు. టిడిపిది జెండా ఒకటి అజెండాలు మాత్రం రెండుగా ఉన్నాయని ధ్వజమెత్తారు. చంద్రబాబు ప్రణబ్ ముఖర్జీకి లేఖ రాసినట్లు చిదంబరానికి లేఖ రాస్తే ప్రజలు టిడిపి పట్ల విశ్వాసంతో ఉంటారన్నారు. టిడిపి నేతలు రాజీనామాలు ఆమోదింప జేసుకొని బస్సుయాత్రలు చేపట్టాలన్నారు. కాగా సమైక్యాంధ్రలో పాల్గొన్న టిడిపి నేతలపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని తదితర పది ప్రశ్నలతో కూడిన ఓ లేఖతో టిటిడిపిని నాగం ప్రశ్నించారు.