హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణ బస్సుయాత్రకు ముందు మారిన సీన్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Telugudesam
హైదరాబాద్: తెలంగాణ ప్రాంతానికి చెందిన తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుల బస్సుయాత్రకు ముందు సీన్ కొద్దిగా మారి పోయింది. తెలంగాణ ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ కోదండరాంతో టిటిడిపి శాసనసభ్యులు గురువారం కలిశారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం రాజీనామా చేసిన అనంతరం వారు తెలంగాణలోని పది జిల్లాల్లో పది రోజుల పాటు ఒక్కో జిల్లాలో ఒక్కో రోజు బస్సు యాత్ర చేయాలని నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. అయితే తమ బస్సు యాత్రకు తెలంగాణ ఐక్య కార్యాచరణ సమితి మద్దతు కోరేందుకే వారు వచ్చినట్లుగా తెలుస్తోంది. గురువారం సాయంత్రం ఈ బస్సు యాత్ర రంగారెడ్డి జిల్లా మేడ్చల్ నుండి ప్రారంభం కానుంది. బస్సుయాత్ర మరికొద్ది గంటల్లో ప్రారంభం అవుతుందనగా ఎర్రబెల్లి తదితరులు కోదండరాంను కలవడం విశేషం.

గత కొంతకాలంగా టిడిపి వారు కోదండరాంపై ధ్వజమెత్తారు. తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు కోదండరాం ఏజెంటుగా వ్యవహరిస్తున్నాడని తదితర ఘాటు వ్యాఖ్యలే చేశారు. రాజీనామాలు చేసిన తర్వాత సైతం వారు కెసిఆర్ వ్యాఖ్యలను కోదండరాం ఖండించక పోవడంపై ప్రశ్నించారు. అయితే అనూహ్యంగా గురువారం బస్సుయాత్రకు కొద్ది గంటల ముందు వచ్చి మద్దతు కోరటం విశేషం. కాగా బస్సు యాత్రలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పెట్టడంపై టిడిపిలో తర్జన భర్జన జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. బాబు ఫోటో పెట్టాలని కొందరు వద్దని కొందరు చెబుతున్నట్టుగా తెలుస్తోంది.

English summary
Telangana agitation scene changed before Telangana Telugudesam bus yatra. TDP mlas met TJAC chiarman Kodandaram today and urged support for bus yatra.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X