వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైయస్ జగన్‌తో కాంగ్రెసు చర్చలు జరుపుతోందా?

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan
హైదరాబాద్: కడప పార్లమెంటు సభ్యుడు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌కు, కాంగ్రెస్ పార్టీకి మధ్య రహస్యంగా చర్చలు జరుగుతున్నాయని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తమ పార్టీ నేతలతో అన్నారు. శుక్రవారం ఇక్కడ కొందరు తమ పార్టీ నేతలతో మధ్యాహ్న భోజనం చేశారు. కాంగ్రెస్ అధిష్టానం ఏదో విధంగా జగన్‌ను కలుపుకోవాలని చూస్తోందని, గులాం నబీ ఆజాద్ ద్వారా వారి మధ్య చర్చలు జరుగుతున్నాయని ఆయన ఈ సందర్భంగా అన్నారు. జగన్ ఏదో ఒక రోజు మళ్ళీ కాంగ్రెస్ గూటికి చేరినా ఆశ్చర్యపడనక్కరలేదని కూడా అన్నట్లు తెలుస్తోంది.

అది జరిగితే మనకే లాభమని, వారిది కేవలం పదవుల తగాదా అని ప్రజలకు అర్ధం అవుతుందని, మనం బలంగా ఉండి ప్రజలకు చేరువ అయితే వారు కలిసినా విడిపోయినా పెద్ద తేడా ఉండదని ఆయన అభిప్రాయపడినట్లు సమాచారం. మధ్యాహ్న భోజనం సందర్భంగా ప్రతిరోజూ కొందరు నేతలతో చంద్రబాబు వరుసగా నిర్వహిస్తున్న సమావేశాల్లో భాగంగా కొంత మంది నేతలతో శుక్రవారం భేటీ అయ్యారు. రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోచుకొని ఆ డబ్బుతో పార్టీలు పెట్టి నడుపుతున్నవారిని గెలిపిస్తే నడిబజార్లో అమ్మేస్తారన్న అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్ళాలని, మొహమాటపడవద్దని ఆయన వారికి సూచించారు. పార్టీ అంతర్గత అంశాలపై కూడా ఆయన అన్నారు.

నియోజకవర్గాలకు ఇన్‌ఛార్జులుగా ఉన్నవారు బాగా పనిచేస్తే టిక్కెట్లు వారికే వస్తాయని, టిక్కెట్టు తమదేనని వారు ఈ రోజు నుంచే ధైర్యంగా ఉండవచ్చునని, కాని ఆ ధైర్యంతో పనిచేయకుండా కాలం గడిపితే ఊరుకొనేది లేదని ఆయన అన్నారు. పనితీరు బాగోలేకపోతే మార్చడానికి నేను వెనకాడనని, బాగా పనిచేస్తే నా పక్కనే ఉంచుకొంటానని ఆయన అన్నారు.

English summary
TDP president Chandrababu Naidu is suspecting talks between Congress leaders and YS Jagan is on.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X