జగన్ పార్టీ ప్లీనరీలో కొండా సురేఖ జై తెలంగాణ

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపి జగన్మోహన రెడ్డి ముఖ్యమంత్రి అయిననాడే మహిళలకు రక్షణ లభిస్తుందని ఆ పార్టీ నాయకురాలు, సినీనటి రోజా అన్నారు. పార్టీ ప్రజాప్రస్థాన ప్లీనరీ సమావేశాలలో ఆమె ప్రసంగించారు. నేడు 6 ఏళ్ల బాలిక నుంచి 60 ఏళ్ల వృద్ధురాలి వరకు రక్షణలేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ సిఎం అయినప్పుడే మహిళా సాధికారిత సాధ్యం అన్నారు. 104, 108 వాహనాలను మూలపడేశారని ఆమె బాధపడ్డారు. అన్ని పట్టణాలలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు నిర్మించవలసిన అవసరం ఉందన్నారు. సంపూర్థ మద్యనిషేధం దిశగా కృషి చేయాలని ఆమె అన్నారు.
ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్ కల్పించింది ఎఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ కాదని, మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అని మాజీ ఎమ్మెల్సీ రెహ్మాన్ చెప్పారు. పార్టీ ప్రజాప్రస్థాన ప్లీనరీ సమావేశాలలో మైనార్టీలకు సంబంధించిన తీర్మానాన్ని ఆయన ప్రవేశపెట్టారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి లేని లోటు ముస్టింలకు తీర్చలేనిదన్నారు. కాంగ్రెస్ వారికి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఎంత గొప్పో, తమకి విజయమ్మ, జగన్మోహన రెడ్డి అంత గొప్ప అన్నారు. వైఎస్ మృతి చెందిన తరువాత ముస్లింలు ఎంతో నష్టపోయారన్నారు. ముస్లింలు అందరూ జగన్మోహన రెడ్డి వెంటే ఉంటారని తెలిపారు. తమకు కావలసింది జగనన్న ముఖ్యమంత్రి కావాలి అంతే అన్నారు. మనకి కులాలు, మతాలు వద్దు, మనది వైఎస్ఆర్ కులం అన్నారు.












Click it and Unblock the Notifications