వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పద్మనాభ స్వామి ఆలయానికి భారీ భద్రత

By Srinivas
|
Google Oneindia TeluguNews

Anantha Padmanabha Swamy Temple
తిరువనంతపురం: కేరళలోని అనంతపద్మనాభ స్వామి దేవాలయంలోని నేలమాళిగలలో దొరుకుతున్న అనంత పద్మనాభ స్వామి ఆలయంలో ఎనలేని సంపద దొరుకుతున్న నేపథ్యంలో భారీగా భద్రత కల్పించనున్నట్లుగా సమాచారం. ప్రపంచంలోనే అత్యంత సంపన్న దేవాలయంగా సంచలనం సృష్టిస్తోన్న ఈ దేవాలయానికి శాశ్వత ప్రాతిపదికన అత్యాధునిక భద్రత కల్పించనున్నారు. ఆలయం, దాని పరిసరాలన్నిటినీ ప్రత్యేక భద్రతా మండలం పరిధిలోకి తీసురావాలని కేరళ పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు వారు రూపొందించిన ప్రణాళికను కేరళ ప్రభుత్వానికి అందజేశారు. సుప్రీంకోర్టు అనుమతితోనే దీనిని అమలుచేయాల్సి ఉంటుంది. పోలీసుల వ్యూహం ప్రకారం పద్మనాభస్వామి ఆలయం చుట్టూ 500 మీటర్ల పరిధిలోని ప్రాంతాన్ని ప్రత్యేక భద్రతా మండలంగా పరిగణిస్తారు.

నిఘా కోసం అత్యాధునిక పరికరాలను అమర్చుతారు. నిరంతర అప్రమత్తతతో రక్షణ విధులు నిర్వర్తించేందుకు ప్రత్యేక పోలీస్‌ దళాన్ని వినియోగిస్తారు. భద్రతాపరంగా ఎన్ని చర్యలు తీసుకొన్నా భక్తులకు, ఆలయ సంప్రదాయాలకు ఎలాంటి ఆటంకం కలగనీయమని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఊమెన్‌ చాందీ ఇప్పటికే స్పష్టం చేశారు. తాము ఖరారు చేసిన ఈ ప్రణాళికను త్వరలో రాష్ట్ర అదనపు ముఖ్య కార్యదర్శి కె.జయకుమార్‌ ద్వారా సుప్రీంకోర్టుకు నివేదిస్తామన్నారు. ఆరో గదిపై అందరిచూపు:పద్మనాభ ఆలయ రహస్య నేలమాళిగలోని ఐదు గదుల్లోని సంపద లెక్కింపు, జాబితా తయారీ స్వల్ప అవరోధాలు మినహా దాదాపు సాఫీగా కొనసాగింది. కానీ ఆరో గదిని తెరవటంపై తీవ్ర తర్జనభర్జనలు జరుగుతున్నాయి. ఆ గది ద్వారాలు తెరవటం అత్యంత క్లిష్టమైన ప్రకియతో కూడుకున్నదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు ఆ గదిని తెరిస్తే తీవ్ర అరిష్టం కలుగుతుందన్న అపోహలూ స్థానికంగా ప్రచారంలో ఉన్నాయి.

ఇప్పటివరకూ వెలుగుచూసిన సంపద విలువ రూ.లక్ష కోట్లని అనధికారిక అంచనా. ఆరో గదిలో ఇంతకు కొన్ని రెట్లు అధికంగా సంపద ఉండవచ్చని వూహిస్తున్నారు. ఆరో గది తెరవటానికి సంబంధించి శుక్రవారం ఓ నిర్ణయం తీసుకొనే అవకాశముంది. దీనిని తెరిచేందకు తొందరపాటు తగదని సుప్రీంకోర్టు నియమిత పరిశీలకుల బృందం అభిప్రాయపడటంతో గురువారం వరకూ దీనిపై నిర్ణయం తీసుకోలేదు. ఇక్కడి ద్వారంపై సర్ప ఆకృతి చెక్కి ఉంది. దీనిని తెరిస్తే వరద వస్తుందని, ప్రకృతి విపత్తులు సంభవిస్తాయని రకరకాల నమ్మకాలు వ్యాప్తిలో ఉన్నాయి. ఆరో గది నుంచి సమీపంలోని సముద్రం వరకూ ఓ రహస్య మార్గం ఉందనేది స్థానికుల మరో విశ్వాసం. రాజవంశీకులు కూడా ఈ ద్వారాన్ని కదిలించవద్దనే చెబుతున్నారు.

English summary
Kerala government is thinking to big protection to Anantha Padmanabha Swamy temple.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X