వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భేటీలతో తెలంగాణ రాజకీయ నేతలు బిజీబిజీ

By Pratap
|
Google Oneindia TeluguNews

Telangana Map
హైదరాబాద్‌: పరస్పర భేటీలతో వివిధ పార్టీలు, సంఘాలకు చెందిన నాయకులు బిజీగా గడుపుతున్నారు. తెలంగాణ ప్రజాప్రతినిధులు రాజీనామాలు చేసినప్పటి నుంచి భేటీలు జోరందుకున్నాయి. ఆ జోరు శుక్రవారం నాడు కూడా కొనసాగింది. తెలంగాణ రాజకీయ జెఎసి చైర్మన్ కోదండరామ్ కాంగ్రెసు రాజ్యసభ సభ్యుడు కె. కేశవ రావును కలిశారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెండైన శాసనసభ్యుడు నాగం జనార్దన్ రెడ్డితో సమావేశమయ్యారు. రాజీనామా చేసిన తెలంగాణ నేతలు రాష్ట్రపతి, ప్రధాని ఎదుట పరేడ్ చేసే విషయంపై జెఎసి సమావేశంలో చర్చించాలని భేటీ అనంతరం నాగం జనార్దన్ రెడ్డి మీడియాతో అన్నారు. అన్ని పార్టీల నాయకులను ఒక తాటిపైకి తేవడానికి ప్రయత్నిస్తానని ఆయన చెప్పారు.

కోదండరామ్ శుక్రవారంనాడు తెలంగాణ ప్రజా ఫ్రంట్ అధ్యక్షుడు గద్దర్‌తో కూడా సమావేశమయ్యారు. గద్దర్ శుక్రవారం సాయంత్రం హైదరాబాదులోని మదీనా ఎడ్యుకేషన్ సెంటర్‌లో రాజీనామాలు చేసిన ప్రజాప్రతినిధులకు తేనీటి విందు ఇచ్చారు. ఈ విందులో కె. కేశవరావు, వివేక్, మందా జగన్నాథం (కాంగ్రెసు), ఈటెల రాజేందర్ (తెరాస), జైపాల్ యాదవ్, రాములు (తెలుగుదేశం), నాగం జనార్దన్ రెడ్డి, హరీశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాజీనామాలు చేసిన తెలుగుదేశం శాసనసభ్యులు తెలంగాణలో బస్సు యాత్ర నిర్వహిస్తూ బిజీగా ఉన్నారు.

ఇదిలా వుంటే, కేంద్ర మంత్రి ఎస్ జైపాల్ రెడ్డి ఢిల్లీలో ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్‌ను కలిసి తెలంగాణ అంశంపై మాట్లాడారు. ఆ తర్వాత కాంగ్రెసు రాజ్యసభ సభ్యుడు వి. హనుమంతరావు జైపాల్ రెడ్డితో సమావేశమయ్యారు. మీడియా సమావేశం ఏర్పాటు చేసి సీమాంధ్ర నాయకులపై నిప్పులు చెరిగిన అనంతరం హనుమంతరావు జైపాల్ రెడ్డితో సమావేశమయ్యారు.

English summary
Telangana leaders in vusy meeting each other and are trying to unite all the political leaders of the region.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X