ముఖ్యమంత్రి మారుతారు: అంబటి రాంబాబు

Ambati Rambabu
కడప: త్వరలో రాష్ట్ర ముఖ్యమంత్రి మారుతారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. ముఖ్యమంత్రి మారే సూచనలు కనిపిస్తున్నాయని ఆయన శనివారం పార్టీ ప్లీనరీ సమావేశంలో అన్నారు. తెలంగాణ అంశాన్ని కేంద్ర ప్రభుత్వం నాన్చుతూ ప్రాంతాల మధ్య వైషమ్యాలు పెంచుతోందని ఆయన విమర్శించారు. తెలంగాణ ప్రజల మనోభావాలను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ఓడిపోతామనే భయంతో ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలను వాయిదాలు వేస్తూ వస్తోందని ఆయన అన్నారు.

నిరుపేదల కోసం కేవలం రాయితీలు ప్రకటి్స్తూ ప్రభుత్వంపై ఆధారపడే విధంగా కాకుండా స్వయంగా అభివృద్ధి చెంది ఆదాయాలను సమకూర్చుకునే విధానాలను అమలు చేయాలని ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు లక్ష్మీపార్వతి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌ను కోరారు. మద్య నిషేధం విషయంలో జగన్ టంగుటూరి ప్రకాశం పంతులు, ఎన్టీ రామారావు బాటలో నడవాలని ఆమె సూచించారు సమాజాన్ని అర్థం చేసుకున్నవాడిగా జగన్ సమాజాన్ని ప్రక్షాళన చేయాలని ఆమె అన్నారు. మనమంత తెలుగు ప్రజలమని, ఈ భావాన్ని గౌరవించాలని ఆమె అభిప్రాయపడ్డారు. జగనన్న రథచక్రాలు వస్తున్నాయని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకురాలు వాసిరెడ్డి పద్మ అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+