డిఎంకెతో పొత్తు కొనసాగుతుంది: ప్రణబ్ ముఖర్జీ

డిఎంకె, కాంగ్రెసు మధ్య పొత్తుపై ఊహాగానాలు అవసరం లేదని, రెండు పార్టీలు కలిసి సాగుతాయని, ఈ బంధం మరింత పటిష్టమవుతుందని కరుణానిధితో భేటీ అనంతరం ప్రణబ్ మీడియా ప్రతినిధులతో అన్నారు. ఏప్రిల్‌లో శానససభ ఎన్నికలు ముగిసిన తర్వాత ఇది తన మూడో చెన్నై పర్యటన అని, తాజా రాజకీయాలపై కరుణానిధికి వివరించేందుకు ఈ పర్యటనను వాడుకున్నానని ఆయన అన్నారు.
ఎ. రాజా, దయానిధి మారన్ స్థానాల్లో డిఎంకె నుంచి ఎవరిని మంత్రివర్గంలోకి తీసుకోవాలనే విషయంపై ప్రణబ్ ముఖర్జీ కరుణానిధితో మాట్లాడినట్లు సమాచారం. యుపిఎ మంత్రివర్గంలో ప్రస్తుతం డిఎంకెక చెందిన అళగిరి మాత్రమే ఉన్నారు. కరుణానిధి కూతురు, రాజ్యసభ సభ్యురాలు కనిమొళి అరెస్టు తర్వాత ఇదే తొలి ఉన్నత స్థాయి సమావేశం కావడం విశేషం.












Click it and Unblock the Notifications