కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణను జగన్ తేల్చాలి: తెలంగాణ నేతలు

By Pratap
|
Google Oneindia TeluguNews

Gattu Ramachandar Rao
కడప: తెలంగాణ అంశంపై స్పష్టమైన వైఖరి ప్రకటించాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని కోరారు. పార్టీ ప్లీనరీ సమావేశంలో శనివారం ప్రసంగించిన గట్టు రామచంద్రరావు, బాజిరెడ్డి గోవర్ధన్, ప్రతాప రెడ్డి పార్టీ తెలంగాణపై స్పష్టమైన వైఖరి చెప్పాలని అన్నారు. తెలంగాణ అంశాన్ని తేల్చాల్సింది యుపిఎ ప్రభుత్వమని, అయితే కాంగ్రెసు తెలంగాణ ప్రజలను మోసం చేసిందని గట్టు రామచంద్ర రావు అన్నారు. తాళం చెవి మన చేతుల్లో లేదు- ఢిల్లీలో ఉందని, అయితే తెలంగాణపై వైయస్ జగన్ ఏం చెప్తారోనని దేశమంతా ఎదురు చూస్తోందని, తెలంగాణలో ఆత్మగౌరవ ఘోష వినిపిస్తోందని, అందువల్ల తెలంగాణపై జగన్ మంచి నిర్ణయం ప్రకటించాలని ఆయన అన్నారు.

తెలంగాణ సెంటిమెంటును గౌరవించాలని మాజీ శాసనసభ్యుడు బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. తాను తెలంగాణవాదినని, అందులో సంశయం లేదని ఆయన అన్నారు. 2009 డిసెంబర్ 23వ తేదీన కేంద్ర హోం మంత్రి చిదంబరం చేసిన ప్రకటనతో తెలంగాణ రాదేమోనని వందల మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆయన చెప్పారు. తెలంగాణ అంశాన్ని కోస్తా, రాయలసీమ ప్రజలు అర్థం చేసుకోవాలని ఆయన కోరారు. తెలంగాణపై ప్రస్తుత అనిశ్చితికి కేంద్ర ప్రభుత్వమే కారణమని మాజీ శానససభ్యుడు ప్రతాప రెడ్డి అన్నారు. వైయస్ జగన్ తెలంగాణకు అనుకూలగా నిర్ణయం తీసుకోవాలని ఆయన అన్నారు. తెలంగాణపై గౌరవప్రదమైన నిర్ణయం తీసుకోవాలని శానససభ్యురాలు కొండా సురేఖ అన్నారు.

English summary
YSR Congress party Telangana leaders urged YS Jagan to take positive decision on Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X