కడప: విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్‌కు వైయస్సాఆర్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని విమర్శించే అర్హత గానీ, ప్రశ్నించే అర్హత గానీ లేదని ఆ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ అన్నారు. తెలంగాణ అంశాన్ని కేంద్రమే తేల్చాల్సి ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణ అంశాన్ని తేల్చకుండా కేంద్రమే ఇరుప్రాంతాల ప్రజలతో దోబూచులాట ఆడుతుందన్నారు. కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలకు సైతం జగన్‌ను విమర్శించే హక్కు లేదన్నారు.
కాగా తెలంగాణ అంశం కేంద్రం పరిధిలో ఉందని, తెలంగాణ ఇచ్చినా ఇవ్వకున్నా తమకు అభ్యంతరం లేదని వైయస్ జగన్మోహన్ రెడ్డి శనివారం జరిగిన ప్లీనరీలో తీసుకున్న నిర్ణయంపై తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీలతో పాటు లగడపాటి రాజగోపాల్ సైతం ధ్వజమెత్తిన విషయం తెలిసిందే. చిరంజీవికి ఉన్న దమ్ము కూడా జగన్‌కు లేదని లగడపాటి వ్యాఖ్యానించారు.