హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్రాణత్యాగం చేసిన విద్యార్థులకు నష్టపరిహారం: కెకె

By Srinivas
|
Google Oneindia TeluguNews

K Keshava Rao
హైదరాబాద్: ప్రత్యేక తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన విద్యార్థుల కుటుంబాలకు ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం చెల్లించాలని కాంగ్రెసు పార్టీ రాజ్యసభ సభ్యుడు కె కేశవరావు ఆదివారం తన నివాసంలో విలేకరులతో మాట్లాడుతూ డిమాండ్ చేశారు. శాంతియుతంగా తెలంగాణ ఉద్యమం జరుగుతుందన్నారు. కాంగ్రెసు పార్టీ ప్రత్యేక తెలంగాణ కోసం అందరినీ కలుపుకొని పోవడానికి సిద్ధంగా ఉందన్నారు. తాము ఎవరికీ వ్యతిరేకం కాదన్నారు. సోమవారం తెలంగాణ కాంగ్రెసు కోర్ కమిటీ సమావేశం ఉంటుందని చెప్పారు. తమ రాజీనామాలు బ్లాక్ మెయిల్ కోసం కాదన్నారు.

తెలంగాణ ఉద్యమాన్ని పార్లమెంటు దాకా తీసుకు వెళ్లేందుకే టి-కాంగ్రెసు రాజీనామాలు చేసిందన్నారు. హింసను తప్పించడానికే రాజీనామాలు చేశామని అన్నారు. నగర పోలీసు కమిషనర్ ఎకే ఖాన్ ఉస్మానియా విశ్వ విద్యాలయ విద్యార్థుల దీక్షకు అనుమతి లేదని చెప్పడం హాస్యాస్పదం అన్నారు. తెలంగాణ కోసం విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని కేశవరావు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల బలిదానాలపై డిజిపి, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఎందుకు ఆలోచించడం లేదని ప్రశ్నించారు. తెలంగాణ కోసం ప్రాణాలర్పించిన కుటుంబాలకు ప్రభుత్వం ఆర్థిక సాయం ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు.

English summary
Congress senior leader K Keshava Rao said today that telangana congress leaders were not resigned for blackmail. They resign to take parliament Telangana agitation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X