వైయస్ జగన్‌పై తెలంగాణలో ఆగ్రహ జ్వాల

కేంద్రం తెలంగాణ ఇవ్వాలంటున్నాడా? వద్దంటున్నాడా అనేది జగన్ స్పష్టంగా చెప్పాలి. ఎన్నో హామీలిచ్చిన జగన్ తెలంగాణపై స్పష్టమైన వైఖరి ఎందుకు ప్రకటించలేదు' అని ప్రశ్నించారు. జగన్ గోడ మీది పిల్లి వాటాన్ని ప్రదర్శించాడని హరీశ్‌రావు మండిపడ్డారు. లోక్‌సభలో సమైక్యవాద ప్లకార్డు పట్టుకున్న జగన్, ఇప్పుడు కప్పదాటు వ్యవహారంగా మాట్లాడారని మాజీ మంత్రి, టీఆర్ఎస్ సీనియర్ నేత నాయిని నర్సింహారెడ్డి విమర్శించారు. తెలంగాణపై చంద్రబాబుది రెండు కళ్ల సిద్ధాంతమైతే, జగన్‌ది రెండు కాళ్ల సిద్ధాంతమని, అందులో ఎలాంటి తేడా లేదన్నారు. ప్రత్యేక తెలంగాణపై స్పష్టమైన వైఖరి ప్రకటించనందుకు నిరసనగా వరంగల్ జిల్లా వ్యాప్తంగా తెలంగాణవాదులు భగ్గుమన్నారు. పలుచోట్ల ఆయన దిష్టిబొమ్మలను దహనం చేశారు.
కడప జిల్లా ఇడుపులపాయలో జరుగుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీలో ఆ పార్టీ వ్యవస్థాపకుడు జగ న్ ప్రత్యేక తెలంగాణ అంశంపై తన వైఖరిని స్పష్టంగా ప్రకటించకుండా దాటవేసే ధోరణిని ప్రదర్శించినందుకు వివిధ జాక్‌ల ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తంచేశారు. జగన్ వైఖరికి నిరసనగా హన్మకొండలోని అమరవీరుల స్థూపం వద్ద తెలంగాణ విద్యార్థి జాక్ జగన్ దిష్టిబొమ్మను దహనం చేసింది. కాకతీయ విశ్వవిద్యాలయంలోని ఎస్‌డీఎల్‌సీఈ సెంటర్‌లో తెలంగాణ రాష్ట్ర విద్యార్థి సంఘం నేతృత్వంలో విద్యార్థులు జగన్ దిష్టిబొమ్మతో ఊరేగింపు జరిపి అనంతరం దహనం చేశారు. నర్సంపేటలో టీఆర్ఎస్ కార్యకర్తలు జగన్‌కు వ్యతిరేకంగా ర్యాలీ తీశారు. దిష్టిబొమ్మను దహనం చేశారు. తెలంగాణపై జగన్ స్పష్టమైన వైఖరి తెలుపనందుకు నిరసనగా శనివారం సాయంత్రం టీఎస్‌జెఎసీ ఆధ్వర్యంలో కరీంనగర్‌లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై దాడి చేశారు.
పోలీసులు ఉండగానే టీఎస్‌జెఎసీ నాయకులు గోడదూకి కార్యాలయం కిటికీలు, బోర్డునుపగులకొట్టారు. కర్రలు, రాళ్ళతో దాడిచే శారు. పోలీసులు లాఠీచార్జీ చేసి నాయకులను ఈడ్చుకెళ్ళి వాహనాల్లో పోలీసుస్టేషన్‌కు తరలించారు. తెలంగాణపై జగన్ స్పష్టమైన వైఖరి ప్రకటించకపోవడంతో టీఆర్ఎస్ నేతలు విమర్శించారు. జగన్ దిష్టిబొమ్మను తెలంగాణ తల్లి విగ్రహంవద్ద ఉరితీసి నిరసన తెలిపారు. తెలంగాణపై మరింత క్లారిటీ కావాలని వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గం నేత కొండా సురేఖ అభిప్రాయపడ్డారు.