వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బొత్స భేటీ, వెనక్కి తగ్గని తెలంగాణ ఎమ్మెల్యేలు

By Pratap
|
Google Oneindia TeluguNews

R Damodar Reddy
హైదరాబాద్: రాజీనామాలు ఉపసంహరించుకోవాలని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ చేసిన సూచనకు పార్టీ తెలంగాణ శానససభ్యులు అంగీకరించలేదు. రాజీనామాలు చేసిన పార్టీ తెలంగాణ శాసనసభ్యులతో ఆయన మంగళవారం సాయంత్రం సమావేశమయ్యారు. ప్రస్తుత పరిస్థితిపై బొత్స తమను అడిగి తెలుసుకున్నట్లు సమావేశానంతరం కాంగ్రెసు తెలంగాణ శాసనసభ్యుడు ఆర్. దామోదర్ రెడ్డి మీడియా ప్రతినిధులకు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఇస్తే సీమాంధ్ర ప్రజలకు గానీ నాయకులకు గానీ ఏం నష్టమో చెప్పాలని అడిగామని, కలిసి ఉంటే తమకు ఉన్న ఇబ్బందులేమిటో చెబుతామని తాము బొత్సకు చెప్పామని ఆయన అన్నారు.

సీమాంధ్ర నాయకులను సంప్రదిస్తామని బొత్స చెప్పినట్లు ఆయన తెలిపారు. తమ అభిప్రాయాలను అధిష్టానానికి విన్నవించి, వారి మాటను తెలియజేస్తానని చెప్పినట్లు కూడా చెప్పారు. రాజీనామాలను వెనక్కి తీసుకోవాలని బొత్స సత్యనారాయణ సూచించారని, అయితే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ప్రకటిస్తేనే ఉపసంహరించుకుంటామని చెప్పామని ఆయన అన్నారు. రేపు తాము చేపట్టబోయే నిరాహార దీక్ష గురించి బొత్స తమను అడగలేదని, నిరాహార దీక్ష కొనసాగుతుందని, తమ కార్యాచరణ యథావిధిగా కొనసాగుతుందని ఆయన చెప్పారు. పార్టీ రాష్ట్ర వ్యవాహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్ తెలంగాణపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తావనకు రాలేదని ఆయన చెప్పారు. బొత్సతో జరిగిన భేటీలో 20 మంది శాసనసభ్యులు పాల్గొన్నారు. సమాచారం అందకపోవడం వల్ల అందరూ రాలేకపోయారని దామోదర్ రెడ్డి చెప్పారు.

English summary
Congress Telangana MLAs rejected withdraw resignations in a meeting with PCC president Botsa Satyanarayana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X