దివంగత వైయస్ సిఫారసు చేసిన కేంద్రమంత్రిపై వేటు!

కాంగ్రెసు పార్టీని, ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీని నిత్యం విమర్శిస్తున్న వైయస్ జగన్‌పై సాయి ప్రతాప్ ఇప్పటి వరకు ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. కేంద్రమంత్రి వర్గంలో ఉన్నప్పటికీ ఆయన జగన్ విమర్శలపై ఏమీ మాట్లాడకుండా తటస్థంగా ఉంటూ వస్తున్నారు. ఆయన తీరుపై అధిష్టానం తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లుగా తెలుస్తోంది. అందుకే ఆయనను తొలగించాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. ఆయన స్థానంలో కిషోర్ చంద్రదేవ్‌ను తీసుకోనున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. తెలంగాణ ప్రాంతంలో సైతం ఒకరికి సహాయ మంత్రి పదవి వచ్చే అవకాశం కనిపిస్తోంది. వి.హనుమంతరావు, సర్వే సత్యనారాయణ, అంజన్ కుమార్ యాదవ్ తదితరుల పేర్లు పరిశీలిస్తున్నట్లుగా సమాచారం.












Click it and Unblock the Notifications