సాయి ప్రతాప్ రాజీనామా, కిషోర్ చంద్రదేవ్‌కు పదవి

అంతేకాకుండా వైయస్‌కు సన్నిహితుడు అయిన సాయి ప్రతాప్ ముందు ముందు వైయస్సాఆర్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు జగన్ వెంట వెళ్లే అవకాశాలు సైతం ఉండటంతో ఆయనపై వేటు పడినట్లుగా తెలుస్తోంది. కాగా కిషోర్ చంద్రదేవ్‌కు గతంలో స్పీకర్ పదవి ఇస్తారని భావించినప్పటికీ ఇప్పటికీ ఆయనకు కేంద్ర కేబినెట్ హోదా లభించింది. ఆయనకు పంచాయతీరాజ్, గిరిజన శాఖ మంత్రిత్వ శాఖను అప్పగించారు. సాయిప్రతాప్ స్థానంలో కావురి సాంబశివరావును తీసుకుంటారని భావించినప్పటికీ కిషోర్ ను తీసుకున్నారు. ఆయనకు ఇప్పటికే చాలా ఆలస్యమయిందని భావించే వారు ఉన్నారు. ఎస్టీ కావడం, వివాదాలు లేక పోవడం కిషోర్ కు కలిసి వచ్చింది.












Click it and Unblock the Notifications