చిత్తూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

భూతగాదాలతో హత్య, ఇళ్లకు నిప్పు పెట్టిన బంధువులు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chittoor District
చిత్తూరు/విశాఖపట్నం: చిత్తూరు జిల్లాలో ఇరువర్గాల మధ్య ఘర్షణ తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. జిల్లాలోని శాంతిపురం ఏడోమైలు దగ్గర భూ తగాదాల కారణంగా ఓ రైతును ప్రత్యర్థులు హత్య చేశారు. దీనికి ప్రతీకారంగా మృతుడి బంధువులు ప్రత్యర్థుల ఇళ్లపై దాడి చేశారు. పక్కనే ఉన్న మార్కెట్ యార్డుకు నిప్పంటించారు. ప్రత్యర్థులకు చెందిన ఇళ్లకు, రెండు కార్లకు, ట్రాక్టరుకు నిప్పు పెట్టారు. దీంతో మంటలు గ్రామంలోని పలు ఇళ్లకు వ్యాపించాయి. రెండు సిలిండర్లు పేలాయి. గ్రామంలో సుమారు 20 లక్షల నష్టం జరిగినట్లుగా తెలుస్తోంది. అయితే ఉద్రిక్తతకు దారి తీసిన ఈ గ్రామం జాతీయ రహదారి పైన ఉండటంతో రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు వచ్చి సర్దిచెప్పే ప్రయత్నం చేసినప్పటికీ మృతుడి బంధువులు వినలేదు.

కాగా విశాఖపట్నంలోని ఆదర్శనగర్ 10వ వీధి నెంబరులో ఇంటికోసం ఓ కొండ పైన గొయ్యి తవ్వుతుండగా మట్టిపెల్లలు కూలి ముగ్గురు కూలీలు మృతి చెందారు. నలుగురు కూలీలు గొయ్యి తవ్వుతుండగా ఒక్కసారిగా మట్టి పెల్లలు మీద పడ్డాయి. స్థానికులు వెంటనే స్పందించడంతో ఒక వ్యక్తి బతికి బయటపడ్డాడు. మిగిలిన ముగ్గురు మృతి చెందారు. దీంతో ఆ కుటుంబాలలో విచారం నెలకొంది.

English summary
Tension take place in santipuram of Chittoor district with farmer murder.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X