భానుకు సహకరించారని హైకోర్టులో వల్లభనేని పిటిషన్

Vallabhaneni Vamsi
హైదరాబాద్: విజయవాడ మాజీ పోలీసు కమిషనర్ సీతారామాంజనేయులుపై సిబిఐచే విచారణ జరిపించాలని కోరుతూ విజయవాడ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు వల్లభనేని వంశీ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానంలో బుధవారం పిటిషన్ దాఖలు చేశారు. వల్లభనేని వంశీ తరఫున ఆయన లాయరు చిరంజీవి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మహిళలకు అసభ్యకర సంక్షిప్త సందేశాలు(ఎస్సెమ్మెస్‌లు) పంపించారని, మద్దెలచెర్వు సూరి హత్య కేసులో ప్రధాన నిందితుడు భాను కిరణ్‌కు పరోక్షంగా సహకరించాలని పిటిషన్‌లో పేర్కొన్నారు.

ఆధారాలుగా ఓ టీవీ ఛానల్ ప్రసారం చేసిన వీడియోలను ఆ పిటిషన్‌తో కలిపి హైకోర్టుకు సమర్పించారు. కాగా అప్పటి డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు అరవింద రావు, సీతారామాంజనేయులు, పడమట సత్యనారాయణపురం సిఐకి హైకోర్టు ఈ కేసుపై రెండు వారాల్లో కొంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+