హైదరాబాద్: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగంగా గురువారం తెలంగాణ వ్యాప్తంగా నిర్వహిస్తున్న రైలు రోకోను ప్రజలు విజయవంతం చేయాలని తెలంగాణ ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ ఆచార్య కోదండరామ్ బుధవారం పిలుపునిచ్చారు. ఎక్కడి ప్రజలు అక్కడనే పట్టాల పైకి వచ్చి తమ నిరసనను తెలియజేయాలని కోరారు. రైలు రోకో కార్యక్రమం ఉన్న నేపథ్యంలో ప్రయాణీకులు తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని ఆయన కోరారు. రైలు రోకో కార్యక్రమంలో భారీ ఎత్తున ప్రజలు పాల్గొనాలని కోరారు.
కాగా తెలంగాణ విషయంలో పూటకో మాట మారుస్తున్న కాంగ్రెసు పార్టీ అధిష్టానంపై ఒత్తిడి పెంచవలసిన సమయం ఆసన్నమైందని ఆయన అభిప్రాయపడ్డారు. కేంద్ర మంత్రి, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ గులాం నబీ ఆజాద్ వ్యాఖ్యలపై స్పష్టత ఇప్పించ వలసిన బాధ్యత తెలంగాణ కాంగ్రెసు ప్రజాప్రతినిధుల పైనే ఉందన్నారు. రైలు రోకో తర్వాత భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు. కాగా రైలు రోకో కార్యక్రమం నేపథ్యంలో రైల్వే శాఖ పలు రైళ్లను రద్దు చేస్తున్నారు.
Telangana JAC chairman Kodandaram called telangana people to success tomorrow's rail rokho. He blamed congress party. He said that they will planned for future after rail roko.
Story first published: Wednesday, July 13, 2011, 16:38 [IST]