గుంటూరు: తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు, తెలుగుదేశం పార్టీ బహిష్కృత శాసనసభ్యుడు నాగం జనార్దన్ రెడ్డిలు సమైక్యవాదులు అని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత కోడెల శివప్రసాద్ బుదవారం గుంటూరు జిల్లాలో విలేకరులతో మాట్లాడుతూ విమర్శించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చే పరిస్థితి లేదన్నారు. కేంద్రమంత్రి, రాష్ట్రవ్యవహారాల ఇంచార్జ్ గులాం నబీ ఆజాద్ వ్యాఖ్యలతో అది తేటతెల్లమైందని చెప్పారు.
రాష్ట్ర ప్రభుత్వానికి పక్షపాతమొచ్చిందని విమర్శించారు. ప్రస్తుతం ప్రభుత్వానికి ఏ అవయవమూ పని చేయడం లేదని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం స్తబ్ధగా ఉందన్నారు. వైయస్సాఆర్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాలు 2జి కుంభకోణం కంటే పెద్దదన్నారు. జగన్ సిబిఐ దర్యాఫ్తుకు సహకరించాలని డిమాండ్ చేశారు.
TDP senior leader Kodela Siva Prasad blamed today that trs chief K Chandrasekhar Rao and Nagam Janardhan Reddy are supporting united andhra. He said Telangana will not come.
Story first published: Wednesday, July 13, 2011, 11:21 [IST]