హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆజాద్‌కు ఏకాభిప్రాయం అడిగే హక్కు లేదు: నాగం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Nagam Janardhan Reddy
హైదరాబాద్: కేంద్రమంత్రి, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జు గులాం నబీ ఆజాద్‌కు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుపై ఏకాభిప్రాయం అడిగే హక్కు లేదని తెలుగుదేశం పార్టీ బహిష్కృత శాసనసభ్యుడు నాగం జనార్దన్ రెడ్డి బుధవారం అన్నారు. తెలంగాణపై ఆజాద్ వ్యాఖ్యలు సరికావని అన్నారు. నగర పోలీసు కమిషనర్ ప్రజాప్రతినిధుల హక్కులను కాలరాస్తున్నారని ధ్వజమెత్తారు. పోలీసు కమిషనర్ సుప్రీం కోర్టు తీర్పుకు వక్రభాష్యం చెబుతున్నారని అన్నారు.

నగర పోలీసు కమిషనర్‌పై సభా హక్కుల నోటీసు ఇస్తామని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రం నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్ష అని అన్నారు. తెలంగాణ వచ్చే వరకు రాజీనామాలపై వెనక్కి తగ్గేది లేదన్నారు. కాగా నాగం జనార్దన్ రెడ్డి బృందం బుధవారం ప్రధానమంత్రి మన్మోహన్ సింగుకు ఓ లేఖ రాసింది. ప్రత్యేక తెలంగాణ, తెలంగాణపై ఆజాద్ వ్యాఖ్యలు తదితర అంశాలు రాసినట్లుగా తెలుస్తోంది.

English summary
TDP suspended MLA Nagam Janardhan Reddy wrote a letter to prime minister Manmohan Singh today. He blamed Ghulam Nabi Azad for his statement.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X