హైదరాబాద్: 2జి స్ప్పెక్టం కేసులో రాజాకు పట్టిన గతే వైయస్సాఆర్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి పడుతుందని తెలుగుదేశం పార్టీ యువ శాసనసభ్యుడు రేవంత్ రెడ్డి బుధవారం ఎన్టీఆర్ ట్రస్టు భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ విమర్శించారు. వైయస్సాఆర్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి తన నిజాయితీ నిరూపించుకునే అవకాశం వచ్చిందన్నారు. జగన్ సుప్రీంకోర్టుకు వెళ్లి తన నిర్దోశిత్వాన్ని నిరూపించుకోవచ్చునని సూచించారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి అవినీతిపై తెలుగుదేశం పార్టీ అలుపెరగని పోరాటం చేసిందని అన్నారు.
జగన్ తాను అవినీతికి పాల్పడలేదని అనుకుంటే బహిరంగ విచారణకు సిద్ధం కావాలని సూచించారు. జగన్ విషయంలో ప్రధానమంత్రి సహా అన్ని వ్యవస్థలు విఫలం అయ్యాయని దుయ్యబట్టారు. జగన్ భజన బృందం న్యాయవ్యవస్థను కించపరిచే వ్యాఖ్యలు మానుకోవాలని హితవు పలికారు. కేంద్ర మంత్రి, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ గులాం నబీ ఆజాద్ సీమాంధ్ర ప్రజాప్రతినిధులకు గులాం అయ్యాడని చైనాలో ఆజాద్ చేసిన వ్యాఖ్యలు సరికాదన్నారు. ఆయన పేరులోనే గులాం ఉందని అన్నారు. అందుకు తగ్గట్టుగానే ఆయన వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఆజాద్ తొత్తులా మాట్లాడుతున్నారని అన్నారు.
Telugudesam party young mla Revanth Reddy said today that ysr congress party president YS Jaganmohan Reddy will sentenced soon. He blamed union minister Ghulam Nabi Azad.
Story first published: Wednesday, July 13, 2011, 16:35 [IST]