తెలంగాణ సాధనే లక్ష్యం: టి-కాంగ్రెసు దీక్ష

తాము శాంతియుతంగానే తెలంగాణ సాధించాలనే లక్ష్యంతో ముందుకు వెళుతున్నామని అన్నారు. కేంద్ర మంత్రి, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ గులాం నబీ ఆజాద్ వ్యాఖ్యలను వారు ఖండించారు. ఆజాద్ విదేశీ పర్యటనలో ఉన్నారని ఆయన వచ్చిన తర్వాత మాట్లాడతామని చెప్పారు. ఆయన మాటలు అర్థరహితమన్నారు. తాము ఎలాంటి ప్యాకేజీలకు ఒప్పుకునేది లేదని తెలంగాణ రాష్ట్రానికే కట్టుబడతామని చెప్పారు. తెలంగాణ ప్రకటించకుంటే ప్రజలు తిరగబడే రోజు వస్తుందని హెచ్చరించారు. తెలంగాణ ప్రకటించే వరకు రాజీనామాలు వెనక్కి తీసుకోమని స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications