వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టి-కాంగ్రెసు, సమైక్యాంధ్ర పోరాట సమితి పోటా పోటీ

By Srinivas
|
Google Oneindia TeluguNews

United Andhra
విశాఖపట్నం: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అంటూ తెలంగాణ ప్రాంత కాంగ్రెసు ప్రజాప్రతినిధులు హైదరాబాదులోని ఇందిరాపార్కులో 48 గంటల నిరాహార దీక్షకు పూనుకున్న నేపథ్యంలో సమైక్యాంధ్ర పోరాట సమితి ఆ దీక్షకు పోటీగా విశాఖపట్నంలో సమైక్యాంధ్రను కోరుతూ 48 గంటల సత్యాగ్రహ దీక్షకు దిగింది. విశాఖలో సమైక్యాంధ్ర పోరాట సమితి ఆధ్వర్యంలో విద్యార్థులు, పలువురు రాజకీయ నాయకులు దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం అంటూ అక్కడి ప్రజాప్రతినిధులు రెచ్చగొట్టే వాఖ్యలకు, దమనకాండకు దిగుతున్నారని ఆరోపించారు. అది సరైనది కాదని సూచించారు. హింసా ప్రవృత్తి వీడి మహాత్మా గాంధీ చూపించిన అహింసా పద్ధతి ఎలా ఉంటుందో చూపించడానికే తాము సత్యాగ్రహంకు పూనుకున్నామని చెప్పారు.

రాజీనామాలతో తెలంగాణ వస్తుందని భావించిన తెలంగాణ ప్రజాప్రతినిధులు ఇప్పటికైనా రాజీనామాలు చేసి బెదిరించడం ద్వారా లక్ష్యాన్ని సాధించలేమని తెలుసుకోవాలని సూచించారు. సంక్షోభం సృష్టించి సాదిద్దామనుకున్న తెలంగాణ రాష్ట్రం సాదిద్దామనుకున్న తెలంగాణ నేతలకు కేంద్ర మంత్రి, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ గులాం నబీ ఆజాద్ వ్యాఖ్యలు చెంపపెట్టు అన్నారు. సమష్టిగా ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని తెలుసుకోవాలన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావాలంటే సీమాంధ్ర ప్రజల అభిప్రాయాలనూ పరిగణలోకి తీసుకోవాలన్నారు. తమ దీక్ష టి-కాంగ్రెసుకు పోటీ దీక్ష కాదన్నారు.

English summary
Samaikyandhra Porata Samithi started satyagraga today at Vishakapatnam district against Telangana Congress 48 hours fast.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X