హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హైకోర్టు తీర్పుతో వైయస్ జగన్ చిక్కుల్లో పడ్డారా?

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Jagan
హైదరాబాద్: వైయస్సాఆర్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తులపై సిబిఐతో ప్రాథమిక దర్యాఫ్తు చేయించాలని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు ఆదేశించడంతో జగన్ చిక్కుల్లో పడ్డట్టు కనిపిస్తోంది. సిబిఐతో దర్యాఫ్తు జరిపితే మరింత చిక్కుల్లో పడవలసి వస్తుందేమోనన్న అనుమానంతోనే జగన్ సుప్రీం కోర్టుకు అప్పీలు చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. విపక్షాలు, పత్రికల కథనాలు పక్కన పెడితే వైయస్ జగన్ ఎన్నికల కమిషన్‌కు గతంలో, ఇప్పుడు సమర్పించిన అఫిడవిట్‌లలోనే జగన్ ఆదాయం బయటపడుతుంది. ప్రాథమిక విచారణలో జగన్ దగ్గర ఉన్న ఆస్తులు తేలితే అది ఎలా వచ్చిందో చెప్పవలసి ఉంటుంది.

2జి కుంభకోణంలో ఇరుక్కున కనిమొళి డిఎంకెకు సంబంధించి టీవీలోకి రూ.200 కోట్లు అప్పుగా మాత్రమే వచ్చాయని, వాటిని మళ్లీ తీర్చామని పత్రాలు చూపించినప్పటికీ ఆమె జైలు పాలు కాక తప్పలేదు. తన తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకొని జగన్ అనామక కంపెనీలను సృష్టించి వాటి ద్వారా సాక్షి, భారతీ, సండూరు ప్రాజెక్టులలోకి భారీగా పెట్టుబడులు తరలించాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వాటన్నింటినీ ఆయన నిరూపించుకోవడం అంత సాధారణ విషయం కాదని పలువురు అభిప్రాయపడుతున్నారు. అందుకే జగన్ వర్గం నేతలు కాంగ్రెసు పార్టీపై ఎదురు దాడికి దిగుతున్నారు. వైయస్ జగన్మోహన్ రెడ్డిపై సిబిఐ దర్యాఫ్తును వారు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

జగన్‌పై సిబిఐ దర్యాఫ్తుకు నిరసనగా వైయస్సాఆర్ కాంగ్రెసు పార్టీ గురువారం పంజాగుట్ట చౌరస్తాలో నిరసన తెలిపింది. జగన్‌పై సిబిఐ దర్యాఫ్తు జరుగుతుందని ముందే తాము ఊహించామని ఆ పార్టీ నేత గట్టు రామచంద్రారావు అన్నారు. ఇదంతా కాంగ్రెసు కుట్ర అని ఆరోపించారు. విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్‌ది తోలు బొమ్మలాటలో పోలిగాడి పాత్రలా ఉందని విమర్శించారు. వైయస్సాఆర్ హయాంలో మంత్రులుగా ఉన్న వారిని సైతం భాగస్వాములు చేయాలని మరికొందరు జగన్ వర్గం నేతలు డిమాండ్ చేస్తున్నారు. అవినీతిలో వైయస్ పాత్ర ఉంటే వారి పాత్ర సైతం ఉంటుందని వారు అంటున్నారు.

English summary
It seems, YSR Congress party president YS Jaganmohan Reddy in crisis with High Court justice on his property.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X