కాంగ్రెసు కండువాతో దీక్షలో కెసిఆర్, కవిత స్టెప్పులు

K Chandrasekhar Rao
హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెసు ప్రజా ప్రతినిధులు అధిష్టానాన్ని ధిక్కరించలేదని రెండేళ్లు ఓపిక పట్టాకే వారు రాజీనామాలు చేశారని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె చంద్రశేఖర రావు గురువారం ఇందిరాపార్కు వద్ద టి-కాంగ్రెసు ప్రజాప్రతినిధుల 48 గంటల నిరాహార దీక్షలో ప్రసంగిస్తూ అన్నారు. కాంగ్రెసు కండువాతో కెసిఆర్ దీక్షలో పాల్గొనడం విశేషం. పార్టీలకతీతంగా 141 మంది ప్రజాప్రతినిధులు తెలంగాణ కోసం రాజీనామాలు సమర్పించడం అద్బుత విషయమన్నారు. టి-కాంగ్రెసు ప్రజాప్రతినిధులు రాజీనామాలు చేస్తే అధిష్టానాన్ని ధిక్కారించినట్లు కాదని 2009లోనే కేంద్రం తెలంగాణ ప్రకటిస్తే సీమాంధ్ర ప్రజాప్రతినిధులు పార్టీలకతీతంగా రాజీనామాలు చేశారని అదే అసలైన ధిక్కారం అన్నారు.

తెలంగాణపై అఖిలపక్ష నిర్ణయనికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకున్నది సీమాంధ్ర ప్రజాప్రతినిధులు అని ఆరోపించారు. కేంద్రం తెలంగాణ ప్రకటించి వెనక్కి తీసుకున్నప్పటికీ టి-కాంగ్రెసు ప్రజాప్రతినిధులు ఇన్నాళ్లు ఓపిక పట్టారని అన్నారు. రెండేళ్ల పాటు నిరీక్షించిన ప్రజాప్రతినిధులు చివరకు చేసేది లేక రాజీనామా చేశారని అన్నారు. ఇష్టం లేకపోతే విడిపోవచ్చునని ఆంధ్రలో కలిపినప్పుడే నాటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ చెప్పారని గుర్తు చేశారు. తెలంగాణకు అన్ని విషయాల్లోనూ అన్యాయం జరిగిందని ఇప్పుడు తెలంగాణ ప్రజలు పిడికిలి ఎత్తారని అన్నారు. తెలంగాణపై కేంద్రం ఇచ్చిన హామీ నిలబెట్టుకోలేదని ఆరోపించారు. తెలంగాణలో అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా తయారయిందన్నారు. తెలంగాణ ప్రజలు ఆత్మగౌరవం కోసం, స్వపరిపాలన కోసం పోరాటం చేస్తున్నారని అన్నారు.

కేంద్రమంత్రి గులాం నబీ ఆజాద్ వ్యాఖ్యలను ఆయన తప్పు పట్టారు. తెలంగాణ సాధన కోసం రాజీనామా చేసిన కాంగ్రెసు ప్రజాప్రతినిధుల చొరవను చరిత్ర మరవదన్నారు. అవాస్తవ కథనాలు ప్రచురించ వద్దని సీమాంధ్ర మీడియాను కెసిఆర్ హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రం ఐక్యమత్యంతోనే సాధ్యమని తెలుగుదేశం పార్టీ బహిష్కృత శాసనసభ్యుడు నాగం జనార్దన్ రెడ్డి అన్నారు. తెలంగాణ సాధన కోసం జెండా, అజెండాలు పక్కన పెట్టాలని డిమాండ్ చేశారు. అందరూ తెలంగాణ జెండా కింద పని చేయాలని సూచించారు. కళాకారులు పాటలు పాడుతున్న సమయంలో రాజయ్య, మందా జగన్నాథం, కవిత స్టెప్పులేసి అందరినీ అలరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+