కర్నూలు: మద్దెలచెర్వు సూరి హత్యతో తనకు ఏ విధమైన సంబంధాలు లేవని, తాను తప్పు చేసినట్లు రుజువైతే ఉరిశిక్షకైనా సిద్ధమని ఆయన అన్నారు. చెక్ బౌన్స్ కేసులో ఆయన గురువారం న్యాయస్థానం ముందు ఆయన హాజరయ్యాడు. సూరి, భానుతో సంబంధాలున్నట్లు, కోట్ల రూపాయల ఆస్తులున్నట్లు ప్రచారం చేస్తున్నారని అయితే అదంతా మీడియా సృష్టేనని ఆయన అన్నారు. సూరి, భానులతో ఎటువంటి పరిచయాలు, సంబంధాలు లేవని రమేష్ స్పష్టంచేశారు.
తనకు ఇప్పటికే లక్షలాది రూపాయలు అప్పులున్నాయని శింగనమల వెల్లడించారు. తనకు ఇప్పటికే 20 లక్షల రూపాయల దాకా అప్పు ఉందని ఆయన చెప్పారు. తాను ఇంత కాలం అజ్ఞాతంలో లేనని, తన ఇంట్లోనే ఉన్నానని ఆయన చెప్పుకున్నారు.