తప్పనిసరి పరిస్థితిలో నిరవధిక సమ్మె: స్వామిగౌడ్

రాజ్యాంగంలోని ఆర్టికల్ - 3 ప్రకారం తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యే వరకు పోరాటం చేస్తామని ఆయన అన్నారు. సమైక్యాంధ్రలో తెలంగాణ ఉద్యోగులకు ఏనాడూ న్యాయం జరగలేదని ఆయన విమర్శించారు. రాజ్యాంగంలోని 14ఎఫ్ నిబంధనను కూడా ప్రభుత్వం తొలగించలేకపోయిందని ఆయన అన్నారు. ప్రభుత్వం తన హామీలను నెరవేర్చనందుకే ఆందోళనకు దిగుతున్నట్లు ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications