వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణపై బయటపడిన డిఎస్, సోనియాకు లేఖ

By Pratap
|
Google Oneindia TeluguNews

D Srinivas
హైదరాబాద్: ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ తెలంగాణకు అనుకూలంగా బయటపడ్డారు. తెలంగాణపై ఆయన శుక్రవారం పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి ఓ లేఖ రాశారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వాల్సిందేనని ఆయన సోనియాను కోరారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత పరిస్థితిలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ప్రత్యామ్నాయం లేదని ఆయన అన్నారు.

తెలంగాణపై నిర్ణయం తీసుకోవడంలో జాప్యం చేయవద్దని ఆయన సూచించారు.తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ వల్ల కాంగ్రెసు బలోపేతమవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణలో ఉద్యమం ఉధృతమవుతోందని, తెలంగాణ ఏర్పాటు చేయక తప్పదని ఆయన అన్నారు. తాను పిసిసి అధ్యక్షుడిగా ఉన్నం కాలం తటస్థంగా ఉండడానికి ప్రయత్నించిన డిఎస్ ఇప్పుడు తెలంగాణ అనుకూలంగా తన వైఖరిని బయటపెట్టారు. పిసిసి అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్న తర్వాత కూడా ఆయన మీడియాకు, పార్టీ కార్యకలాపాలకు దూరంగానే ఉంటూ వస్తున్నారు. మధ్యలో ఓసారి ఢిల్లీకి వెళ్లి సోనియా గాంధీని, ఇతర కాంగ్రెసు అధిష్టానం పెద్దలను కలిశారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం రాజీనామాలు చేసిన నియోజకవర్గాల్లో పార్టీని పోటీకి దించడమే కాకుండా నిజామాబాద్ నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేశారు. ఆ ఉప ఎన్నికల్లో బిజెపి అభ్యర్థి లక్ష్మినారాయణపై ఓటమి చవి చూశారు. తెలంగాణపై తన వైఖరి స్పష్టంగానే ఉందని, అయితే పిసిసి అధ్యక్షుడిగా తెలంగాణ కోసం ముందుకు రావడం సరి కాదని ఆయన చెబుతూ వచ్చారు.

English summary
former PCC president D Srinivas expressed his pro - Telanagna stand. He wrote letter to party president Sonia Gandhi on Telangana issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X