వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
సిఎం పీఠం కోసమే తెలంగాణ ఉద్యమం: జెసి

రాజకీయ పార్టీలకు ప్రజలు బుద్ధి చెప్పే రోజు వస్తుందని ఆయన అన్నారు. వేర్పాటువాదానికి అంత ప్రాధాన్యం లేదని ఆయన అన్నారు. విభజన సమస్య మన రాష్ట్రానికి మాత్రమే పరిమితమైంది కాదని, దేశవ్యాప్తంగా ఈ సమస్య ఉందని ఆయన అన్నారు. తెలంగాణ రాజకీయ నాయకులే తెలంగాణ కావాలని అంటున్నారని ఆయన అన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ఆస్తులపై సిబిఐ ప్రాథమిక విచారణకు కోర్టు ఆదేశించడం వెనక ప్రభుత్వ పాత్ర ఏమీ లేదని ఆయన అన్నారు. సిబిఐ విచారణకు ముఖ్యమంత్రి లేఖ రాస్తే పరిస్థితి మరోలా ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుత మంత్రి పి. శంకరరావు ప్రైవేటు వ్యక్తిగానే జగన్ ఆస్తులపై హైకోర్టుకు లేఖ రాసినట్లు ఆయన తెలిపారు.