అందుకే తెలంగాణవాళ్లు రెచ్చిపోతున్నారు: టిజి

కేవలం సమైక్యాంధ్ర అంటే సరిపోదని, రాయలసీమ, ఆంధ్ర ప్రాంతాలు తమ హక్కుల కోసం కూడా పోరాటం చేయాలని ఆయన అన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని డిమాండ్ చేస్తున్నామని ఆయన చెప్పారు. తాము రాయలసీమ హక్కుల కోసం పోరాటం చేస్తున్నామని, ఆంధ్రుల హక్కుల ఐక్యవేదిక కూడా అటువంటి పోరాటం చేయాలని ఆయన అన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడానికి తాము ఎటువంటి త్యాగాలకైనా సిద్ధమని మరో సీమాంధ్ర మంత్రి శైలజనాథ్ అన్నారు.












Click it and Unblock the Notifications