కెవిపి, వైయస్ జగన్ కలిశారు: ఆత్మీయ పలకరింపు

కాగా దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి మృతి తర్వాత రోశయ్య హయాంలో రాజకీయ సలహాదారుడిగా కొనసాగినప్పటికీ కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి కెవిపి రామచంద్రారావు రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. అయితే జగన్ హవాను అడ్డుకోవడానికి కెవిపిని పిసిసి అధ్యక్ష పీఠంపై కూర్చుండ బెడతారని లేదా మరో మంచి పదవి ఇస్తారనే వార్తలు వచ్చాయి. పిసిసి పదవి కోసం కెవిపి వారం రోజుల పాటు ఢిల్లీలో తిష్ట వేసినట్లు వార్తలు వచ్చాయి. కాంగ్రెసు అధిష్టాం సైతం జగన్‌ను ఎదుర్కొనడానికి కెవిపికి ఏదో ముఖ్యమైన పదవి ఇవ్వాలన్న అభిప్రాయంతో ఉన్నట్టుగా తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో పెళ్లిలో కెవిపి, జగన్ పెళ్లిలో ఆత్మీయంగా మాట్లాడుకోవడం చర్చానీయాంశమయ్యింది. కాగా ఇప్పటి వరకు కెవిపి, జగన్ ఎవరూ ఒకరిపై ఒకరు చిన్న కామెంట్ చేయలేదు. ఎమ్మెల్యే కొండా సురేఖ మాత్రం ఓమారు కెవిపిపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు.












Click it and Unblock the Notifications