హైదరాబాద్: విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్‌కు చెందిన ల్యాంకో హిల్స్ అనుబంధ కంపెనీ లార్స్ కో కంపెనీ మంగళవారం సిబిఐ ముందు విచారణకు హాజరయింది. లగడపాటి శ్రీధర్ లార్స్ కో కంపెనీ తరఫున సిబిఐ విచారణకు హాజరయ్యారు. కంపెనీకి సంబంధించిన పలు పత్రాలను ఆయన సిబిఐకి అందించారు. లగడపాటి శ్రీధర్‌కు చెందిన రెండు కంపెనీల ప్రతినిధులు విచారణకు హాజరయ్యారు. ఇందులో లార్స్ కో కంపెనీ ఉంది.
కాగా సోమవారం సిబిఐ విచారణకు హెటెరో గ్రూప్ ఆఫ్ కంపెనీస్, పివిపి వెంచర్స్, నవభారత్‌కు చెందిన ప్రతినిధులు సిబిఐ విచారణకు హాజరైన విషయం తెలిసిందే. సోమ, మంగళవారాల్లో సిబిఐ ముందుకు జగన్ కంపెనీలో పెట్టుబడులు పెట్టిన పలు కంపెనీలు బారులు తీరాయి. ముంబయి, కోల్‌కతా, బెంగుళూరులోని సిబిఐ విచారణ చేపట్టనుంది.
Lagadapati Sridhar attended before CBI for enquiry. Sridhar is larsco company owner which is related to Vijayawada MP Lagadapati Rajagopal's Lanco hills company.
Story first published: Tuesday, July 19, 2011, 13:14 [IST]