తెలంగాణ ఇచ్చేది లేదని తేల్చిన ప్రణబ్ ముఖర్జీ

pranab mukherjee
న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధ్యం కాదనే విషయాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ తేల్చేశారు. సీమాంధ్ర నాయకులు చెప్పిన విషయాలను బట్టి ప్రణబ్ ముఖర్జీ అధిష్టానం నిర్ణయాన్ని తేల్చేసినట్లు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధ్యం కాదని చెప్పినట్లు అర్థమవుతోంది. సీమాంధ్ర నాయకులు మంగళవారం రాత్రి ప్రణబ్ ముఖర్జీతో సమావేశమయ్యారు. అనంతరం సీమాంధ్ర శాసనసభ్యుడు గాదె వెంకటరెడ్డి మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. సమాచార లోపం వల్లనే 2009 డిసెంబర్ 9వ తేదీన కేంద్ర హోం మంత్రి చిదంబరం ప్రకటన వెలువడిందని, దానికి అందరం బాధ్యులమేనని ప్రణబ్ ముఖర్జీ అన్నట్లు గాదె వెంకటరెడ్డి చెప్పారు. గాదె వెంకటరెడ్డి చెప్పిన వివరాల ప్రకారం - కాంగ్రెసు పార్టీ భాషా ప్రయుక్త రాష్ట్రాలకు కట్టుబడి ఉందని ప్రణబ్ ముఖర్జీ అన్నారు.

రాష్ట్రం సమైక్యమా, ప్రత్యేకమా అనేది ఒక రోజులో తేలేది కాదని ప్రణబ్ అన్నారు. రాజకీయ పార్టీలు ఎప్పటికప్పుడు తమ విధానాలను మార్చుకోవడం వల్లనే ఈ పరిస్థితి వచ్చిందని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తన వైఖరిని మార్చుకున్నారని ఆయన అన్నారు. బిజెపికి తాము మూడు లేఖలు రాశామని, అయినా సమాధానం రాలేదని ఆయన చెప్పారు. సంప్రదింపుల ద్వారానే సమస్య పరిష్కారమవుతుందని, రాష్ట్రంలో ప్రశాంత వాతావరణాన్ని కాపాడాలని ఆయన అన్నారు. తమ వాదనలో బలం ఉందని తేలిందని గాదె వెంకటరెడ్డి అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+