వెనక్కి తగ్గిన ఆజాద్: ఢిల్లీకి తెలంగాణ నేతలు

ఆర్టికల్ 3ను సీమాంధ్రులు వక్రీకరిస్తున్నారని ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. తెలంగాణపై ప్రకటన రాలేదన్న సీమాంధ్ర ప్రజాప్రతినిధులు డిసెంబర్ 9 ప్రకటనను ఎలా అర్థం చేసుకుంటున్నారని ప్రశ్నించారు. తెలంగాణపై అధిష్టానం నుండి ఖచ్చితమైన హామీ వస్తే రాజీనామాలు ఉపసంహరించుకునే విషయాన్ని పరిశీలిస్తామని చెప్పారు. తెలంగాణ ప్రక్రియ కోసమే చర్చలు అన్నారు. ఆజాద్ ఒకటి రెండు రోజుల్లో చైనాలో చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇస్తారని చెప్పారు. ప్రధానికి సీమాంధ్రులు ఇచ్చిన నివేదికలో అన్ని అవాస్తవాలే అన్నారు. కాగా తెలంగాణ కాంగ్రెసు నేతలకు అధిష్టానం నుండి పలుమార్లు పిలుపు వచ్చినప్పటికీ ఆజాద్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటేనే చర్చలకు వెళతామని పట్టుబట్టిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications