నిజామాబాద్: వైయస్సాఆర్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎలాంటి తప్పులు చేయకుండా టాటాలను ఎలా మించి పోయాడని నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడు మధుయాష్కీ బుధవారం విలేకరులతో మాట్లాడుతూ ప్రశ్నించారు. సిబిఐ విచారణకు ముందు తాను ఎలాంటి విచారణలు అయినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించిన జగన్ తీరా హైకోర్టు సిబిఐ ప్రాథమిక విచారణకు ఆదేశించిన తర్వాత తనపై విచారణ ఆపాలని కోరుతూ సుప్రీం కోర్టును ఆశ్రయించడం ఎందుకని ప్రశఅనించాడు.
తప్పు చేయనప్పుడు విచారణను ఎందుకు ఆపాలని కోరుతున్నారన్నారు. న్యాయవ్యవస్థను అప్రతిష్టపాలు చేసేలో మాట్లాడిన వైయస్ జగన్మోహన్ రెడ్డిపై కోర్టు ధిక్కార కేసు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణకు టి-కాంగ్రెసు నేతలంతా కట్టుబడి ఉన్నారని అన్నారు.