హైదరాబాద్: వైయస్సాఆర్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి మంచి అవకాశం వచ్చిందని మంత్రి రఘువీరా రెడ్డి బుధవారం అన్నారు. రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు జగన్ కంపెనీలపై ప్రాథమిక విచారణకు ఆదేశించడం ద్వారా జగన్‌కుమంచి అవకాశం వచ్చిందన్నారు. జగన్ ఇప్పుడు తన నిజాయితీ నిరూపించుకోవడానికి మంచి ఆస్కారం లభించిందన్నారు. జగన్‌ను వేధించాల్సిన అవసరం కాంగ్రెసుకు లేదన్నారు.
తెలంగాణ ప్రాంతానికి చెందిన మంత్రులు త్వరలో విధుల్లో చేరతారని ఆయన అభిప్రాయపడ్డారు. సీమాంధ్రులు అయినా, తెలంగాణ వారు అయినా భావోద్వేగాలకు లోనుకావద్దని సూచించారు. ప్రాణత్యాగాలు, రాజీనామాలతో సమస్యలు పరిష్కారం కావని అన్నారు. న్యూఢిల్లీలోని పార్లమెంటు భవనం సమీపంలో తెలంగాణ ప్రాంత యువకుడు యాదిరెడ్డి మృతి చాలా బాధాకరం అన్నారు.