వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రిసార్ట్ కోసం సుప్రీం కోర్టు కెళ్శిన డిస్కో డాన్సర్ మిధున్

By Pratap
|
Google Oneindia TeluguNews

Mithun Chakraborty
న్యూఢిల్లీ: సినీ నటుడు మిధున్ చక్రవర్తికి తమిళనాడు ఏనుగుల కారిడర్ సమస్య అయింది. ఒకప్పుడు డిస్కో డాన్సర్ గా ఖ్యాతి కెక్కిన మిధున్ చక్రవర్తి తమిళనాడులోని తన రిసార్టును కాపాడుకోడానికి సుప్రీంకోర్టు కెక్కాడు. రిసార్టు కొరకు సేకరించిన భూమి కారిడర్ పరిధిలో వున్నందున దానిని అటవీ శాఖ స్వాధీనం చేసుకోవాలని, రిసార్టును తొలగించాలని గతంలో హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఏనుగులు ఒక పర్వతంపైనుండి మరో పర్వతానికి వెళ్ళేదారిలోనే మిధున్ రిసార్టు వుంది.

కోర్టుకు మిధున్ చెప్పే కారణాలు అధ్భుతంగా వున్నాయి. తన రిసార్టు ఆ ప్రాంతంలోని గిరిజనులకు ఉపాధి కల్పిస్తోందని, పర్యావరణ టూరిజాన్నిప్రోత్సహిస్తోందని చెపుతాడు. సంవత్సరం పొడుగునా, అక్కడి గిరిజనులకు ఆదాయాన్నిచ్చి ఏనుగులు స్వేచ్ఛగా తిరిగే అడవులలో వారు తమ ఇంధనం కొరకు చెట్లు నరకకుండాను, జంతువులను చంపకుండాను చేస్తోందని వాదిస్తున్నాడు. అడవులకు తన రిసార్టు కంటే కూడా అక్కడి గిరిజనులతోనే అధిక నష్టం అంటాడు. అక్కడి అడవుల, జంతువుల ప్రాధాన్యతలను ఇపుడు వారు బాగా గ్రహించారని వాదిస్తాడు.

ఎటువంటి నష్టపరిహారం లేకుండానే తన హోటల్ను స్వాధీనం చేసుకోవాలన్న మద్రాస్ హైకోర్టు నిర్ణయాన్ని విమర్శించాడు. అంతేకాదు, గతంలో సర్వే చేయబడిన ఏనుగుల కారిడార్ కంటే కూడా ఇపుడు చూపబడేది అధిక వైశాల్యంకలదిగా చెపుతాడు. ఇదే విషయమై ఆ ప్రాంతంలోని ఇతర హోటల్ యజమానులు కూడా కోర్టుకెళ్ళారు. తమిళనాడు అటవీ శాఖ రిసార్టులతో అడవులు విధ్వంసమవుతున్నాయంటూ హైకోర్టులో పిటిషన్ వేయడంతో మిధున్ కు ఈ సమస్య వచ్చిపడింది.

English summary
Other hoteliers and land owners in the area have also moved the apex court on the matter. Chakraborty has claimed that the area, which the Tamil Nadu forest department has been ordered to acquire, is far greater than had been earlier surveyed to be in use as the elephants' corridor. The forest department had told the HC that the hotels were operating in violation of the Tamil Nadu preservation of private forests' Act.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X