వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అందుకే దాడి చేశా, చింతిస్తున్నా: హరీష్ రావు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Harish Rao
న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్రం కోసం ఆత్మహత్య చేసుకున్న యాదిరెడ్డి మృతదేహాన్ని ఎపి భవన్ తీసుకు వస్తామని చెప్పి నేరుగా విమానాశ్రయానికి తరలించారని, అతని మృతదేహాన్ని అనాథ శవంలా అంత్యక్రియలు చేద్దామని చూశారని అందుకే తనకు కోపం వచ్చి ఉద్యోగులను కొట్టానని అందుకు తాను చింతిస్తున్నానని తెలంగాణ రాష్ట్ర సమితి సిద్దిపేట శాసనసభ్యుడు హరీష్ రావు విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు. తెలంగాణ బిడ్డను అవమానించారన్న ఆక్రోశంలో తాను అలా ప్రవర్తించానని అన్నారు. రాజ్యసభ సభ్యుడు వి హనుమంతరావు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో మాట్లాడినా అధికారులు నిర్లక్ష్యం చేశారని అన్నారు. తాను ఆవేశంలో అలా చేశానని అన్నారు. ఉద్దేశ్య పూర్వకంగా చేయలేదన్నారు.

యాదిరెడ్డి మృతదేహాన్ని దొంగచాటుగా అధికారులు విమానాశ్రయానికి తరలించారని ఈటెల రాజేందర్ అన్నారు. భౌతికాయం విషయంలో అధికారులు పోలీసులకు తప్పుడు సమాచారం ఇచ్చారని ఆరోపించారు. మాపై విశ్వాసం లేని సీమాంధ్ర ప్రభుత్వాన్ని మేం గుర్తించమని అన్నారు. ఇంత రాద్దాంతం జరుగుతుంటే ఇంకా ఎలా కలిసి ఉండాలని అనుకుంటారని మాజీ ఎంపీ వినోద్ కుమార్ ప్రశ్నించారు. దాడులకు ఎవరు పాల్పడినా అది తప్పే అని అన్నారు. అయితే ఆవేశంలో మాత్రమే హరీష్ రావు కొట్టాడని చెప్పారు. తెలంగాణ కోసం ఆత్మహత్య చేసుకున్న యువకుడిని అనాథ శవంలా తరలించినందుకే హరీష్ రావు ఆవేశంలో దాడి చేశారని సిరిసిల్ల ఎమ్మెల్యే కెటి రామారావు అన్నారు. కాగా సిపిఐ, కాంగ్రెసు నేతలు సైతం ఎపి భవన్ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

English summary
TRS MLA Harish Rao said apology to AP Bhavan employee for attack. He give clarity on attack.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X