హైదరాబాద్: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించే విషయంలో తెలంగాణ ఉద్యోగుల ఆలోచన మారాలని పార్లమెంటు సభ్యుడు హర్షకుమార్ గురువారం విలేకరులతో మాట్లాడుతూ సూచించారు. సమ్మెలు, ధర్నాలు, రాజీనామాల వల్ల తెలంగాణ రాష్ట్రం రాదని సూచించారు. అందరి ఏకాభిప్రాయంతోనే తెలంగాణ సాధ్యమన్నారు. రాష్ట్రంలో అందరి నుండి ఏకాభిప్రాయం సాధించేందుకు కేంద్ర ప్రభుత్వం తన కృషి చేస్తుందన్నారు.
గురువారం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో సిఎం క్యాంపు కార్యాలయంలో భేటీ అయ్యారు. భేటీ అనంతరం హర్షకుమార్ విలేకరులతో మాట్లాడారు. కోటిపల్లి - నర్సాపూర్ రైల్వే మార్గానికి కేంద్రం రూ.50 కోట్లు విడుదల చేసినట్లు చెప్పారని అన్నారు.